మహిళల టెన్నిస్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సహజ యమలపల్లి ఎల్ జార్డి (మొరాకో)తో కలిసి లెక్సింగ్టన్ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. అమెరికాలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సహజ, ఎల్ జార్డి ద్వయం 2-6, 7-5, 12-10తో డలేనా హెవిట్ (అమెరికా), వాలెరియా స్ట్రకోవా (ఉక్రెయిన్) జోడీపై విజయం సాధించింది.