భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. అన్ని ఫార్మాట్లలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్లేయర్‌గా మాత్రం ఆమె మరికొంత కాలం జట్టులో కొనసాగనుంది.
ఇటీవలే ఆసియా కప్, ఆసియా క్రీడల్లో జట్టును విజేతగా నిలపడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్‌కు 37 ఏళ్లు వచ్చేసిన నేపథ్యంలో ఆమెకు ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన స్థితిలో ఆమే స్వయంగా ఈ బాధ్యతల నుంచి వైదొలగింది. ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. సారథ్య బాధ్యతలను అందుకోనుంది.