ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా జరిగే 2032 ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు చిహ్నంగా గులాబి రంగు చిలుకను ఆ దేశం ఎంపిక చేసింది. సాధారణంగా ఆస్ట్రేలియా అనగానే అందరికీ కంగారూనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చిలుకను ఎంపిక చేశారు. ఒలింపిక్స్‌కు ఆరేళ్లు సమయం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని ఆస్ట్రేలియాకు ఆహ్వానించేందుకు మేం పనులు ప్రారంభించామని బ్రిస్బేన్ లార్డ్ మేయర్ ఆడ్రియన్ స్క్రినర్ పేర్కొన్నారు.