ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సాగిన ఆసియా క్రీడలు 2026, అక్టోబరు 4న ముగిశాయి. ఈ క్రీడల్లో 450 రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో కనీసం 50 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. మిజుహో పార్క్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో 90 నిమిషాల పాటు జరిగిన ముగింపు వేడుకల్లో 45 దేశాల అథ్లెట్లు పాల్గొన్నారు. 85 పతకాలు గెలుచుకున్న భారత్‌ (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు) నాలుగో స్థానంతో నగోయాకు వీడ్కోలు పలికింది.

  • ముగింపు వేడుకల సందర్భంగా ట్రాప్‌ షూటర్‌ నీరూ దాండా అథ్లెట్ల పరేడ్‌లో మువ్వన్నెల పతాకాన్ని చేబూనింది. క్రీడల్లో ఆమె రెండు స్వర్ణాలు, ఓ రజతం గెలిచించింది. ఏషియాడ్‌లో వ్యక్తిగత ట్రాప్‌ పసిడి గెలిచిన భారత తొలి మహిళగా కూడా ఆమె నిలిచింది. అయితే భారత పురుషుల్లో ఎవరికీ పతాకధారిగా అవకాశం దక్కలేదు. ‘ఒకే ఆసియా’ అన్న థీమ్‌తో ముగింపు కార్యక్రమం జరిగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram