ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల్లో భారత్‌ 2026, అక్టోబరు 3న 5 బంగారు పతకాలను ఖాతాలో వేసుకుంది. క్రికెట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచిన భారత్‌.. హాకీలో స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. కుంకుమ్‌ మొహోద్‌ (ఆర్చరీ), ప్రణవి (గోల్ఫ్‌), అమన్‌ సెహ్రావత్‌ (రెజ్లింగ్‌) వ్యక్తిగత స్వర్ణాలతో మెరిశారు. మరో రెండు రజతాలు, రెండు కాంస్యాలు కూడా సొంతం చేసుకున్న భారత్‌.. పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

  • ఆసియా క్రీడల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్‌ జట్టు స్వర్ణం సాధించింది. ఫైనల్లో 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. పాక్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేయగా భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 రన్స్‌ సాధించింది.

  • ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. 2028 ఒలింపిక్స్‌ బెర్తును కూడా దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు మలేసియాను 5-1తో ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ రెండు గోల్స్‌ (11, 57 నిమిషాలు) కొట్టగా.. జుగ్‌రాజ్‌ సింగ్‌ (23), హార్దిక్‌ సింగ్‌ (42), శిలానంద్‌ లక్రా (54) తలో గోల్‌ సాధించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram