ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌ 2026, అక్టోబరు 2న మూడు పసిడి పతకాలు గెలిచింది. లవ్లీనా బొర్గోహెయిన్‌ (75కేజీ), పర్వీన్‌ హుడా (65కేజీ), అంకుశ్‌ పంఘాల్‌ (80కేజీ)లు అద్భుత ప్రదర్శనలతో స్వర్ణాలు సాధించారు. ఈ విజయాలతో భారత్‌.. బాక్సింగ్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంతో ఏషియాడ్‌ పోరును ముగించింది. మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు సాధించిన ఇండియాకు ఆసియా క్రీడల బాక్సింగ్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. లవ్లీనా ఫైనల్లో 5-0తో చైనాకు చెందిన జియి బావోపై విజయం సాధించింది. గత ఆసియా క్రీడల్లో లవ్లీనా రజతం గెలిచింది. మరో ఫైనల్లో పర్వీన్‌ హుడా 3-2తో పారిస్‌ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత చెన్‌ నీన్‌-చిన్‌ను ఓడించింది. మేరీకోమ్‌ (2014), లవ్లీనా తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత మూడో మహిళా బాక్సర్‌గా పర్వీన్‌ ఘనత సాధించింది. 2022 క్రీడల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇక పురుషుల 80 కిలోల ఫైనల్లో అంకుశ్‌ పంఘాల్‌ 5-0తో దక్షిణ కొరియాకు చెందిన మిన్‌స్యోంగ్‌పై విజయం సాధించాడు.

  • 44 సంవత్సరాల తర్వాత ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలిచింది. అక్టోబరు 2న జరిగిన ఫైనల్లో సలీమా బృందం 1-0తో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత విజేత చైనాను ఓడించింది. అంతేకాదు 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ బెర్తునూ ఖరారు చేసుకున్నారు. 1982 ఆసియా క్రీడల్లో చివరగా భారత మహిళల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 1988, 2018 క్రీడల్లోనూ భారత్‌ ఫైనల్‌ చేరినా.. పసిడి అందుకోలేకపోయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram