ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో నితేశ్‌ సివాచ్‌ రజతం నెగ్గాడు. 2026, అక్టోబరు 1న నగోయాలో జరిగిన 97 కేజీల విభాగంలో ఫైనల్లో నితేశ్‌ 0-4తో యూరినకజటో (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రీడల్లో గ్రీకో రోమన్‌లో భారత్‌కు రజత పతకం దక్కింది. భారత్‌ ఆసియా క్రీడల గ్రీకో రోమన్‌లో కాంస్యం కంటే మెరుగైన పతకం గెలవడం 1962 (2 స్వర్ణాలు, 3 రజతాలు) తర్వాత ఇదే తొలిసారి.

  • తిరుమూరు గణేశ్‌ మణిరత్నం కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నాడు. అతడు 149-144తో కాంగ్‌ డంగ్‌ (వియత్నాం)ను ఓడించాడు. ఇప్పటికే ఆర్చరీ పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్లో గణేశ్‌ స్వర్ణం గెలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram