ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల్లో 2026, సెప్టెంబరు 30న భారత్‌కు చెందిన కాంపౌండ్‌ ఆర్చర్లు మూడు పసిడి పతకాలు సాధించారు. టీమ్‌ విభాగంలో అన్ని స్వర్ణాలనూ మన ఆర్చర్లే నెగ్గారు. జ్యోతి సురేఖ, చికిత, ప్రీతిక ప్రదీప్‌లతో కూడిన భారత జట్టు మహిళల టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో 238-234తో చైనా త్రయం వునియర్, యూ వాంగ్, ఫంగ్యావ్‌ వీలపై విజయం సాధించింది.

  • భారత త్రయం తమ స్కోరు (238)తో కొరియా జట్టు పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇక పురుషుల టీమ్‌ ఈవెంట్లో కుశాల్‌ దలాల్, సాహిల్‌ జాదవ్, గణేశ్‌ మణిరత్నంలతో కూడిన జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ త్రయం 238-237తో చైనా జట్టును ఓడించింది. మరోవైపు చికిత, సాహిల్‌ జోడీ మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణాన్ని హస్తగతం చేసుకుంది. ఫైనల్లో ఈ ద్వయం దక్షిణ కొరియాకు చెందిన పార్క్‌ జుంగ్యూన్, చోయ్‌ యోంగీ జంటపై విజయం సాధించింది.

  • రెండు జట్లు 157-157తో సమంగా నిలవడంతో షూటాఫ్‌ అనివార్యమైంది. షూటాఫ్‌లో భారత జంట పైచేయి సాధించింది. సాహిల్, చికిత స్వర్ణాల డబుల్‌ సాధించారు. ఈ జంట విజయంతో భారత్‌కు 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఆర్చరీ కోటా స్థానం కూడా దక్కింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో వచ్చే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. గత ఆసియా క్రీడల్లోనూ కాంపౌండ్‌ టీమ్‌ విభాగాన్ని భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram