ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల ట్రాప్‌ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా నీరూ దండా రికార్డు సృష్టించింది. 2026, సెప్టెంబరు 29న నగోయాలో జరిగిన ఫైనల్లో 30 టార్గెట్లలో ఆమె 28 షూట్‌ చేసింది. ఈ క్రమంలో ఆసియా రికార్డు (24)ను బద్దలు కొట్టింది.

  • చైనాకు చెందిన యునాంగ్‌ (26) రజతం నెగ్గగా.. కువైట్‌ షూటర్‌ హజార్‌ (21) కాంస్యం గెలుచుకుంది. ఈ స్వర్ణానికి ముందు నీరూ మహిళల ట్రాప్‌ ఈవెంట్లో రజతం కూడా నెగ్గింది. నీరూ, ఆషిమా, మనీషాలతో కూడిన జట్టు 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (346) స్వర్ణం, కువైట్‌ (325)కు కాంస్యం గెలిచాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram