ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ ఏషియాడ్‌లో రజతం నెగ్గింది. 2026, సెప్టెంబరు 28న మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో ఇషా 38 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన గ్జియావో జియారుగ్జువాన్‌ స్వర్ణం సాధించగా, కిమ్‌ సుక్‌ (ఉత్తర కొరియా) కాస్యం నెగ్గింది. మొత్తంగా ఆసియా క్రీడల్లో ఇషాకి ఇది మూడో పతకం. 21 ఏళ్ల ఇషా 2022 క్రీడల్లో వ్యక్తిగత, టీమ్‌ రజతాలు గెలిచింది.

  • లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ ఈ క్రీడల్లో రెండో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 1500 మీటర్ల పరుగులో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (3:36.72)తో గుల్వీర్‌ రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన లిజావా (3:36.35) స్వర్ణం నెగ్గాడు. మరో జపాన్‌ రన్నర్‌ నగియా మోరి (3:37.92) కాంస్యం గెలుచుకున్నాడు. ఇంతకు ముందు గుల్వీర్‌ 10 వేల మీటర్ల పరుగులో కూడా రజతం సాధించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram