ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది. 2026, సెప్టెంబరు 25న నగోయాలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్‌జీత్‌ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ ద్వయం 484.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన సుహియాన్‌ హాంగ్, గ్వేన్‌ చూ జంట (478.0) రజతం నెగ్గగా.. 415.8 స్కోరుతో ఇరాన్‌ ద్వయం కాంస్య పతకం చేజిక్కించుకుంది.

  • అలాగే ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్‌ కుమార్‌ త్రయం పురుషుల 50మీ రైఫిల్‌ 3 పొజిషన్‌లో రజతం సాధించింది. ఈ జట్టు 1762 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు (1766) స్వర్ణం నెగ్గగా.. కొరియా జట్టు (1751) కాంస్యం సొంతం చేసుకుంది. షూటింగ్‌లో ఇప్పటిదాకా భారత్‌ ఒక స్వర్ణం, అయిదు రజతాలు, మూడు కాంస్యాలు నెగ్గింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram