ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల్లో 2026, సెప్టెంబరు 24న నగోయాలో జరిగిన పరుగు పోటీల్లో భారత్‌కు ఓ రజతం, కాంస్యం దక్కింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పోటీల్లో పూవమ్మ రాజు, విశాల్‌ తెన్నరసు, విద్య రామ్‌రాజ్, మను టీఎస్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. ఈ బృందం 3 నిమిషాల 14.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌ జట్టు 3:12.87 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించింది. కాంస్యం నెగ్గిన వియత్నాం (3:14.54 సె)కు, భారత్‌కు తేడా 0.08 సెకన్లే. 2018 ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టినపుడు స్వర్ణం గెలిచిన భారత్‌.. గత క్రీడల్లో రజతం సాధించింది.

  • ఇక మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమ కుమారి కాంస్యం గెలిచింది. ఈ పోటీలో భారత్‌ పతకం నెగ్గి 16 ఏళ్లవుతోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram