భారత్ స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. 2026, సెప్టెంబరు 23న నగోయాలో జరిగిన 49కేజీల విభాగంలో ఆమె 198 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆమె స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు లేపింది. ఆసియా క్రీడల్లో చానుకు ఇదే తొలి పతకం.
మళ్లీశ్వరి (1998) తర్వాత ఏషియాడ్‌లో పతకం గెలిచిన భారత తొలి వెయిట్‌లిఫ్టర్‌గా చాను ఘనత సాధించింది.
ఉత్తర కొరియాకు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ రి సాంగ్ గమ్ 215 (94+ 121కేజీ) కిలోలు ఎత్తి, స్వర్ణం గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో ఆమెకిది హ్యాట్రిక్ టైటిల్.