ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌

ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌
  • ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్‌ కాంస్యం నెగ్గింది. 2026, ఏప్రిల్‌ 17న ఓర్డోస్‌ (చైనా)లో జరిగిన మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పోరులో సరాంట్‌సెట్‌సెగ్‌ (మంగోలియా)ను ఇనున్‌గంబి ఓడించింది. తొలి రౌండ్లో భారత జూడోకాకు బై దక్కడంతో నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ చేరింది.
  • క్వార్టర్స్‌లో షిరిన్‌జాన్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఇనున్‌గంబి ఓడిపోయింది. రెపిచేజ్‌ రౌండ్లో అలీనా (కిర్గిజ్‌స్థాన్‌)పై నెగ్గిన ఆమె.. కాంస్య పోరుకు అర్హత సాధించింది. కంచు కోసం జరిగిన బౌట్లో ఇనున్‌గంబి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram