ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యను, నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్‌ను అనుసంధానించే సరయూ-కమల ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (బాలేన్) 2026, నవంబరు 23న దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జనక్‌పుర్ ధామ్‌ను జానకీ దేవి జన్మ భూమిగా విశ్వసిస్తుంటారు. ఈ కొత్త రైలు వారానికోసారి నడుస్తుంది. అయోధ్య కంటోన్మెంట్, జనక్‌పుర్ ధామ్ స్టేషన్ల మధ్య మొత్తం 604 కిలోమీటర్ల ప్రయాణాన్ని 19 గంటల్లో పూర్తి చేస్తుంది. అయోధ్య నుంచి ప్రతి సోమవారం, జనక్‌పుర్ నుంచి ప్రతి శనివారం రైలు బయలుదేరుతుంది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన బాలేన్.. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య తాజాగా 8 కీలక ఒప్పందాలు కుదిరాయి.