జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) ఖాతాదారుల కోసం పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించింది. ‘ఎన్‌పీఎస్ సెంట్రల్’ పేరుతో తీసుకొచ్చిన ఈ వేదికపై.. ఎన్‌పీఎస్‌లో నమోదు చేసుకోవడం, పెట్టుబడులు పెట్టడం, పింఛను ఖాతాలను నిర్వహించడం లాంటి సేవలు పొందొచ్చు. 2026, అక్టోబరు 1న ఎన్‌పీఎస్ దివస్ సందర్భంగా ఈ వేదికను ప్రారంభించినట్లు పీఎఫ్‌ఆర్‌డీఏ అక్టోబరు 19న వెల్లడించింది.