ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం-అజయ్) పథకం కింద దేశంలో మొత్తం 18,093 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు. ఈ పథకం కింద 785 విద్యార్థి వసతి గృహాల నిర్మాణం పూర్తి చేసినట్లు సామాజిక న్యాయ, సాధికారికతశాఖ వెల్లడించింది. ఆదర్శ గ్రామ విభాగం కింద 47,200 గ్రామాల్లో 47.79 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు ఆ శాఖ తెలిపింది. దీని కింద మొత్తం 46,944 అభివృద్ధి పనులు పూర్తి చేయడంతోపాటు 27,032 గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించింది.
షెడ్యూల్డ్ కులాలు అధిక సంఖ్యలో ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా 2021-22లో ఈ పథకాన్ని రూపొందించారు.