ఆధునిక విజ్ఞాన యుగంలో ఇంటర్నెట్ సేవలు పెద్దలతో పాటు చిన్నారులకూ ఎంతో అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని వినియోగించుకోవడం వారి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. మైనర్లను లైంగిక దోపిడీకి గురిచేసే, తప్పుదోవ పట్టించే అశ్లీల, అసభ్య వీడియోలు, కంటెంట్‌ను కట్టడి చేయడం కోసం ఇంటర్నెట్‌ను బాలలకు దూరం చేయడం తగదని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం అభిప్రాయపడింది.
స్వచ్ఛంద సంస్థ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్స్’ కేసులో ఈ మేరకు తీర్సు ఇచ్చింది.