జనగణనకు సంబంధించి 1990 నాటి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 2026, అక్టోబరు 16న సవరించింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ సంస్థల టీచర్లను, ఇతర సిబ్బందిని కూడా జనగణన ఎన్యూమరేటర్లుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ కుమార్ నారాయణ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలకు, సొసైటీలు లేదా ట్రస్టులకు చెందిన టీచర్లను, క్లర్కులను, ఇతర ఉద్యోగులు, వ్యక్తులను ప్రభుత్వాలు జనగణన ఎన్యూమరేటర్లుగా నియమించుకోవచ్చని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.