మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్వపు హిందూ సామాజిక వ్యవస్థలో బీసీలుగా అనుభవించిన వెనుకబాటుతనం మారిన మతంలోకి బదిలీ అయినట్లుగా భావించలేమని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను షెడ్యూల్డు కులాలకు చెందిన వారిగా కూడా పరిగణించలేమని తెలిపింది. ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తికి బీసీ (ముస్లిం) కేటగిరీలో రిజర్వేషన్లు వర్తింపజేయడం తగదన్న మద్రాస్‌ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యానికి నిరాకరించడంతో పాటు దానిని సవాల్‌ చేసిన తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం 2026, అక్టోబరు 15న కొట్టివేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram