మన దేశంలో కొత్త కార్లు, స్పోర్ట్స్ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ) కోసం అత్యంత కఠినమైన బీఎస్-7 (భారత్ స్టేజ్-7) ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలుష్యాన్ని మరింత తగ్గించేలా కొత్త నిబంధనలను ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త ఉద్గార ప్రమాణాలను 2029 నుంచి 2035 వరకు మూడు దశల్లో అమలు చేయనున్నారు.