ఆదాయ పన్ను చట్టం-1961

ఆదాయ పన్ను చట్టం-1961

ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 147(ఏ) రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. దాన్ని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను పునఃమదింపు (రీ ఎసెస్‌మెంట్‌) నిమిత్తం సెక్షన్‌ 148, 148(ఏ) కింద జూరిస్‌డిక్షనల్‌ ఎసెసింగ్‌ ఆఫీసర్లు (జేఏఓలు) చేపట్టిన చర్యలన్నీ చెల్లుబాటు కావని తెలిపింది. జేఏఓల ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. కొత్త ఐటీ చట్టం అమల్లోకి వచ్చాక 1961 నాటి ఆదాయ పన్ను(ఐటీ) చట్టానికి సవరణలు చేయటం చట్టబద్ధం కాదని చెప్పింది. సెక్షన్‌ 151(ఏ) కింద నోటీసుల జారీ ప్రక్రియ డిజిటల్, ఫేస్‌లెస్‌ విధానంలోనే జరగాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని పక్కనబెట్టి జేఏఓలు నేరుగా పన్ను మదింపు చేయటం, నోటీసులు ఇవ్వటాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం అక్టోబరు 12న కీలక తీర్పు వెలువరించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram