హెచ్చరిక వ్యవస్థ

హెచ్చరిక వ్యవస్థ

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న హిమానీనద సరస్సు ‘వసుంధర’ వద్ద నీటిమట్టాల పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికలు లక్ష్యంగా సెన్సర్‌ వ్యవస్థను విజయవంతంగా ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం 2026, అక్టోబరు 13న ప్రకటించింది. హిమాలయ శ్రేణిలో విపత్తుల శాస్త్రీయ పర్యవేక్షణకు ఈ పరిణామం ఊతమిస్తుందని తెలిపింది. ఇది హిమానీనద సరస్సుల విస్ఫోటం, వరదల ముప్పును సకాలంలో పసిగట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇందులో ఏర్పాటుచేసిన సెన్సర్లు గాలి వేగం, దిశ, వర్షపాతం, సౌర శక్తి, వాతావరణ పీడనం వంటి అంశాలను అధ్యయనం చేస్తాయి. సరస్సులోని నీటి ఉపరితల కదలికలు, హిమపాత అవకాశాలనూ ఇది పసిగడుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram