కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఒడిశాకు బ్రజ్‌మోహన్ రాం, కర్ణాటకకు సుధాయాదవ్, ఉత్తరాఖండ్‌కు దాల్‌సింగ్ బిసెన్, సిక్కింకు దుశ్యంత్ గౌతంలు నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓంప్రకాశ్ మాథుర్‌ను కేరళంకు బదిలీచేశారు. ఇప్పటివరకూ కేరళం గవర్నర్‌గా ఉంటూ తమిళనాడు బాధ్యతలను అదనంగా నిర్వహిస్తూ వచ్చిన రాజేంద్ర అర్లేకర్‌ను తమిళనాడుకు పరిమితం చేశారు. ఈ మేరకు 2026, అక్టోబరు 12న రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నియామకాలతో ప్రస్తుతం ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ గవర్నర్లుగా సేవలందిస్తున్న కంభంపాటి హరిబాబు, థావర్‌చంద్ గహ్లోత్, గుర్మిత్‌సింగ్‌ల పదవీకాలం ముగియనుంది.