తగిన ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నందుకుగానూ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’గా ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ధ్రువీకరించింది. తమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదివారం నుంచి 2028 అక్టోబరు 10 వరకు.. రెండేళ్ల కాలానికిగానూ ఈ ధ్రువీకరణ జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2026, అక్టోబరు 11న వెల్లడించింది.