2026-27 ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరిసాగు విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్లమేర తగ్గినట్లు తెలిపింది. ఆ తర్వాత కర్ణాటక (4.23 ల.హె), ఉత్తర్‌ప్రదేశ్ (1.84), మధ్యప్రదేశ్ (1.75), ఆంధ్రప్రదేశ్ (1.70)లు ఉన్నాయి. మరోవైపు ఒడిశా, అస్సాం, బిహార్, గుజరాత్‌లలో కొంతమేర వరి సాగు విస్తీర్ణం పెరిగింది.