కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
  • ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గం 2026, అక్టోబరు 6న రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరకు రవాణా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అథారిటీ (ఐటీఎల్‌ఏ-ఇట్లా) ఏర్పాటు ఒకటి కాగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈల) వృద్ధికి అవసరమైన మూలధనం సమకూర్చడానికి రూ.10,000 కోట్లతో నిధి ఏర్పాటు రెండోది.

  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించడానికి, అవసరమైన పరిశోధనలు చేసి, అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం తీసుకురావడానికి ఇట్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇది వాణిజ్యశాఖ పరిధిలో పనిచేస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram