దేశంలో 60 చీతాలు

దేశంలో 60 చీతాలు

భారతదేశంలో పుట్టిన ఒక చీతా (కెజేపి21) మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ అభయారణ్యంలో అయిదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 60కి చేరిందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ 2026, అక్టోబరు 5న వెల్లడించారు. 60లో భారతలో పుట్టినవి 41 చీతాలు. ఆఫ్రికాలోని బోట్సువానా నుంచి తీసుకువచ్చిన ఒక చీతా ఈ పిల్లలకు తండ్రి. ఈ పిల్లల జననం భారతదేశంలో బోట్సువానా చీతా వంశ విస్తరణకు నాంది పలికింది. దేశంలో పెరుగుతున్న చీతా జనాభాకు కొత్త జన్యుపరమైన వంశాన్ని జోడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram