సుప్రీం కోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణ, గుజరాత్, దిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయల నియామక ఉత్తర్వులను 2026, అక్టోబరు 5న కేంద్ర న్యాయశాఖ జారీ చేసింది. ఈ ముగ్గురి నియామకంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. ఇంకా ఒక ఖాళీ ఉంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల గరిష్ఠ సంఖ్య 38గా ఉంది.