గుజరాత్ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది.
వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి అంశాలతో పాటు వాటికి సంబంధించిన ఇతర విషయాలకు సంబంధించిన చట్టాలను నియంత్రించడం, క్రమబద్ధీకరించడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది.