ప్రధాని మోదీ నేతృత్వంలో దిల్లీలో 2026, సెప్టెంబరు 30న కేంద్ర మంత్రివర్గం మొత్తం ఆరు ముఖ్యమైన రబీ పంటల ఎంఎస్‌పీకి (2027-28 రబీ మార్కెటింగ్ సంవత్సరానికి) ఆమోద ముద్ర వేసింది. గోధుమలు, శనగల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. 2027-28 రబీ సీజన్‌కుగాను క్వింటాలుకు గోధుమల ఎంఎస్‌పీని రూ.25 పెంచి రూ.2,610గా, శనగల మద్దతు ధరను రూ.83 పెంచి రూ.5,958గా నిర్ణయించింది.
మద్దతు ధరను కుసుమలకు రూ.7,215, బార్లీకి రూ.2,286, మసూర్‌దాల్‌కు రూ.7,390, ఆవాలకు రూ.6,613గా ప్రకటించింది. 2026-27 సీజన్‌లో మద్దతు ధర శనగలకు రూ.225 మేర, గోధుమలకు రూ.160 మేర పెరిగింది. కుసుమల ఎంఎస్‌పీని నిరుడు రూ.600 మేర పెంచారు. ఈసారి అంతకంటే ఎక్కువగా రూ.675 పెంచారు. కుసుమ, ఆవాలు మినహా మిగిలిన అన్ని పంటల ఎంఎస్‌పీ నిరుటితో పోలిస్తే తక్కువగానే పెరిగింది.