మధ్యప్రదేశ్‌లో 21 ఏళ్ల విరామం తర్వాత తాజాగా మళ్లీ ప్రభుత్వ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని 2026, సెప్టెంబరు 25న ‘ముఖ్యమంత్రి సుగమ్ పరివాహన్ సేవా’, పీఎం ఈ-బస్ సేవా’ పథకాల కింద రాష్ట్రంలోని ఏడు నగరాల్లో 351 బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రారంభించారు.