త్రిపుర ప్రభుత్వం వారానికి అయిదు రోజుల పనిదినాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మాణిక్ సాహా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ, అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఉద్యోగుల పని, వ్యక్తిగత జీవిత సమతుల్యతను మెరుగుపరచడంతోపాటు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై కార్యాలయాలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి.