దేశంలోని జాతీయ పొగాకు విరమణ సేవల కేంద్రానికి (ఎన్‌టీక్యూఎల్‌ఎస్) గత పదేళ్లలో కోటి ఫోన్‌కాల్స్ రాగా.. 2.32 లక్షల మందికి ఈ దురలవాటు నుంచి విముక్తి పొందేలా సహాయం అందించారు. 37 లక్షలకుపైగా కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించారు. మార్చి 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు. పొగాకు అలవాటు మానుకున్న వారిలో 18 - 24 వయసు యువత 91,933 మంది ఉన్నారు. ప్రజల చేత పొగాకు అలవాటు మానిపించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ 2016 మే 30న టోల్ ఫ్రీ క్విట్‌లైన్ (1800 - 11 - 2356) సేవలను ప్రారంభించింది. ఇది దిల్లీ విశ్వవిద్యాలయంలోని వల్లభ్‌భాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్ (వీపీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తోంది.