విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకం ప్రారంభం కానుంది. ఈ మేరకు విశాఖ పోర్టు ఆవరణలో ఇప్పటికే అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ అందుబాటులో ఉంది. దేశీయంగా పలు క్రూజ్‌లు ఇంతవరకు ప్రయాణించగా 2026, జులై 15 నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభం కానున్నాయి. కార్డేలియా క్రూజ్ విశాఖ అంతర్జాతీయ టెర్మినల్ నుంచి జులై 15న బయలుదేరి చెన్నై మీదుగా ఫుకెట్ (థాయ్‌లాండ్), లాంకావి (మలేసియా), కౌలాలంపూర్, సింగపూర్ వరకు ప్రయాణించనుంది.