దిల్లీలోని రవీంద్రభవన్‌లో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో 2026, అక్టోబరు 19న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు-2024, 2025 ప్రదానోత్సవం నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొత్తం 106 మంది కళాకారులకు అవార్డులు అందించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు, తెలంగాణకు చెందిన ఇద్దరు కళాకారులలు ఉన్నారు.
విజేతలు ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించి శాలువాతో సత్కరించారు.