భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవాలియర్ డి లార్డ్రే నేషనల్ డీ లా లెజియన్ డి హానర్’ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ప్రకటించారు. భారత్-ఫ్రాన్స్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో, టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణలో అందించిన సేవలకు గుర్తింపుగా సునీల్ మిత్తల్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. అక్టోబరు 28న దిల్లీలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో ఈ అవార్డు ప్రదానోత్సం జరిగింది.