ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణం లాంటి ఆర్థిక షాక్‌లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులకు పరిష్కారాలను సూచించిన అమెరికా ఆర్థిక నిపుణులు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ వుడ్‌ఫోర్డ్‌లకు 2026 ఏడాదికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. కొవిడ్ మహమ్మారి, ప్రస్తుత ఘర్షణల సమయంలో ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు విధాన నిర్ణేతలకు సాయపడే నమూనాలను వారు రూపొందించారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో అక్టోబరు 12న ఆర్థిక శాస్త్ర నోబెల్ విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.