ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో చూపిన తెగువకుగాను భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ప్రకటించారు. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’కు ఆయనను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు.