జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేస్తూ.. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం (నవీ) పిళ్లై 2026 నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. అంతర్జాతీయ శాంతి, సమానత్వ చట్టాల కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ అక్టోబరు 9న ప్రకటించింది. నవీ పిళ్లై భారత సంతతి మహిళ. ఆమె పూర్వీకులు తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు.