రసాయన అణువుల్లో ‘దర్పణ ప్రతిబింబాల (మిర్రర్ ఇమేజెస్)’ చిక్కుముడి విప్పిన శాస్త్రవేత్తలు హెన్రీ బి కేగన్, కెన్సో సోయీలను ప్రతిష్ఠాత్మక నోబెల్ వరించింది. రసాయన శాస్త్రంలో వీరిద్దరినీ 2026 ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోంలో అక్టోబరు 7న ప్రకటించింది.
అణువుల హోమోకైరాలిటీ దానంతటదే స్వాభావికంగా ఎలా ఆవిర్భవిస్తుందన్నది శాస్త్రవేత్తలను శతాబ్ద కాలానికి పైగా వేధించిన ప్రశ్న. దానికి సమాధానాన్ని కేగన్, సోయీ తమ విశేష కృషితో కనుగొన్నారని నోబెల్ కమిటీ (కెమిస్ట్రీ) ఛైర్మన్ హీనర్ లింకె పేర్కొన్నారు. వారు అభివృద్ధి చేసిన రసాయనిక చర్యలు అద్భుతమైనవంటూ ప్రశంసించారు.

