నాడీ కణాల్లో పనిని ప్రారంభించేందుకు లేదా ఆపేసేందుకు మెదడు ఉపయోగించే యంత్రాంగాలను మరింత లోతుగా విశ్లేషించేందుకు వీరు కృషి చేస్తున్నారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. ఈ బహుమతి కింద దక్కే 12 లక్షల డాలర్ల (దాదాపు రూ.11.55 కోట్లు) నగదు బహుమతిని డైసరోథ్, హెగెమన్, నగెల్ పంచుకోనున్నారు.


