పాకిస్థాన్‌కు చెందిన జలీలా హైదర్, అమెరికాకు చెందిన టిమ్నిట్ గెబ్రూ ‘రైట్ లైవ్లీహుడ్’ అవార్డు 2026కి ఎంపికయ్యారు. నిరంకుశ పాలన, హింస, మహిళలపై వివక్ష, కృత్రిమమేధ (ఏఐ) వల్ల కలిగే ముప్పులకు వ్యతిరేకంగా చేస్తోన్న కృషికి వీరికి ఈ అవార్డు దక్కింది. ఇంకా జార్జియాకు చెందిన చట్టపరమైన హక్కుల రక్షణ సంస్థకు, దక్షిణ ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న మహిళా రైతుల నెట్వర్కుకు కూడా రైట్ లైవ్లీహుడ్ అవార్డులు ప్రకటించారు.