ఐరాస గౌరవ పతకాలు

ఐరాస గౌరవ పతకాలు

దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తరఫున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న 550 మంది భారతీయులకు ఐరాస గౌరవ పతకాలను అందించింది. ఘర్షణలతో ప్రభావితమైన ఆ దేశంలో పౌరుల రక్షణ, శాంతి నిర్మాణాల కోసం పనిచేస్తున్న వారి నిబద్ధతకు గుర్తుగా.. సౌత్‌ సూడాన్‌ లోని మలకల్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐరాస ఈ పురస్కారాలను ప్రదానం చేసింది. 53 మంది మహిళలు సహా 565 మంది భారత బ్లూ హెల్మెట్‌లకు, 464 మంది రువాండా శాంతి పరిరక్షకులకు ఈ పురస్కారాలు అందించినట్లు సౌత్‌ సూడాన్‌లోని ఐరాస మిషన్‌ తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram