అరుణాచల్‌ప్రదేశ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని లాంగ్‌డింగ్‌ జిల్లాలో ‘బోవిస్టా కలరేటా’ జాతికి చెందిన ఒక అరుదైన పుట్టగొడుగును భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)-కృషి విజ్ఞాన కేంద్ర (కేవీకే) సంయుక్త బృందం గుర్తించింది. జెడువా గ్రామంలో కేవీకే బృందం పసుపు బంతిలా ఉండే ఈ పుట్టగొడుగు నమూనాను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. లాంగ్‌డింగ్‌ జిల్లాలో బోవిస్టా కలరేటా ఉనికికి సంబంధించిన రికార్డులు ఏవీ ఇంతవరకు లేవు. మైక్రోస్కోపిక్, మాలిక్యులర్‌ పరీక్షలలో ఇది బోవిస్టా కలరేటా శిలీంధ్రంగా తేలితే అది తూర్పు హిమాలయాల జీవవైవిధ్యానికి మరొక విశిష్ట ప్రతీక అవుతుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram