జోజి లా సొరంగం

జోజి లా సొరంగం
  • జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ల మధ్య ఉన్న జోజి లా ప్రాంతంలో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న 13.153 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 2026, జూన్‌ 9న ప్రారంభించారు. దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూకశ్మీర్‌-లద్దాఖ్‌లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఈ సొరంగాన్ని నిర్మించింది.
  • ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజులపాటు మైనస్‌ 20 డిగ్రీల నుంచి మైనస్‌ 30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుపానులను తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram