భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ ప్రతిష్ఠాత్మక ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 74వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.