అనూప్‌ బాగ్చీ

అనూప్‌ బాగ్చీ
  • దేశీయంగా బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈఓ)ల్లో అత్యధిక వేతనం పొందే వ్యక్తిగా అనూప్‌ బాగ్చీ నిలిచారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), సీఈఓ గా అక్టోబరు చివర్తో ఆయన బాధ్యతలు చేపడతారు. అనూప్‌కి రూ.35.90 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని బ్యాంక్‌ ప్రతిపాదించింది.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026-27కు రూ.8.97 కోట్ల స్థిర వేతనం, రూ.26.92 కోట్ల లక్షిత వేరియబుల్‌ వేతనం ఉంటాయి. అదనంగా షేర్ల అనుసంధానిత ఇన్‌స్ట్రుమెంట్స్‌ రూపంలో సుమారు రూ.7.35 కోట్ల విలువైన ఒకేసారి చెల్లించే ‘జాయినింగ్‌ బోనస్‌’నూ బాగ్చీ పొందుతారు. ఇవి నాలుగేళ్ల కాలంలో వెస్టింగ్‌ (అర్హత పొందే ప్రక్రియ) అవుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram