స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ‘టైమ్ 100 నెక్స్ట్-2026’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న తదుపరి తరం నాయకుల్లో భాగంగా టైమ్ ఆయనను గుర్తించింది.
ఇస్రో మాజీ శాస్త్రవేత్త అయిన పవన్, 2018లో హైదరాబాద్ కేంద్రంగా స్కైరూట్‌ను స్థాపించారు.