తొలి ట్రిలియనీర్‌ మస్క్‌

తొలి ట్రిలియనీర్‌ మస్క్‌
  • స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రపంచానికి తొలి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్లు/సుమారు రూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తి మస్క్‌ మాత్రమే. 2026 జూన్‌ 12న అమెరికా మార్కెట్లలో స్పేస్‌ఎక్స్‌ షేర్లు నమోదయ్యాయి.
  • నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్‌ షేరు 150 డాలర్ల వద్ద లిస్ట్‌ అయింది. పబ్లిక్‌ ఇష్యూ ధర(135 డాలర్లు)తో పోలిస్తే ఇది 11% అధికం. దీంతో ఈ ఏరోస్పేస్‌ కంపెనీ విలువ 1.96 లక్షల కోట్ల డాలర్ల (రూ.186 లక్షల కోట్లకు పైగా)కు చేరింది. అమెరికాలో మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద ఆరో కంపెనీగా నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా 75 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించింది. బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ ప్రకారం.. సంస్థాగత మదుపర్లలో 70% మంది ఈ ఐపీఓలో దీర్ఘకాలిక దృక్పథంతోనే పెట్టుబడులు పెట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram